15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

11-06-2025 11:05 PM

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన 81 మంది లబ్ధిదారులకు రూ.81,09,396/- ఎనభై ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Arekapudi Gandhi) పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో భాగంగా అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఇప్పటికే రెండు కార్యక్రమాలు అమలు చేశామన్నారు. అలాగే కొత్త గనులను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు,పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.