24 May, 2026 | 2:12 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

ఎన్నికల నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి

29-11-2025 07:40 PM

• మద్యం అమ్మకాలపై నిఘా 

•  బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహించడం, అనధికారిక మద్యం విక్రయాలు జరపడం పూర్తిగా నిషేధించబడిందని గరిడేపల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చలికంటి నరేష్ తెలిపారు. అధికారికంగా ఉన్న మద్యం షాపులు కూడా నిర్ణయించిన సమయాల్లో మాత్రమే పనిచేయాలని, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపేలా అక్రమంగా మద్యం సరఫరా లేదా పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.

గ్రామాలు,వాడలు,కాలనీలు,ప్రధాన రహదారులపై ప్రత్యేక నిఘా టీంలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచినట్లు తెలిపారు. ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బెల్ట్ షాపులు నిర్వహించడం,గోప్యంగా మద్యం అమ్మడం, నిల్వ ఉంచడం వంటి ప్రయత్నాలు చేస్తే వారిపై చట్టరీత్యా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో శాంతి భద్రతను నిలబెట్టడం కోసం పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నియమాలను అందరూ గౌరవించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.