1 April, 2026 | 12:01 PM

Breaking News

దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •  

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..

29-11-2025 07:37 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ బాలాజీనగర్ కి చెందిన దాణాల సంతోష్(40) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా అతను మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 28న రాత్రి సుమారు 8:30 గంటలకు మద్యం సేవించిన తర్వాత అతను ఇంటి ముందు యాసిడ్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు. వెంటనే అతని భార్య భవాని, సంతోష్ ను చికిత్స నిమిత్తం ఘట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించగా అతను 29న శనివారం తెల్లవారు జామున 3:30 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.