10 April, 2026 | 8:32 PM

Breaking News

అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •  

సిద్దిపేట జిల్లాలో నగదు పంపిణీ కలకలం

13-05-2024 02:24 AM

సిద్దిపేట, మే 12 (విజయక్రాంతి):  ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లాలో నగదు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపింది. సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న బీఆర్‌ఎస్ నాయకుడు జువ్వాన్న కనకరాజు ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఓ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆదివారం పెద్ద సంఖ్య లో పోలీసులు కనకరాజు ఇంటిని చుట్టుముట్టి ఇంట్లో సోదాలు చేశారు. సుమారు మూడు గంటల పాటు సోదాలు చేసిన పోలీసులకు రూ.230 నగ దు మాత్రమే లభించిందని అధికారులు వెల్లడించారు.  సిద్దిపేట పట్టణంలోని 39వ వార్డులో నివాసం ఉంటున్న రత్నం అనే బీ జేపీ నాయకుని ఇంట్లో సుమారు రూ.లక్ష వి లువ గల మద్యం పోలీసుల సోదాలలో బ యటపడింది. ఐదు మద్యం కాటన్లను స్వాధీ నం చేసుకొని రత్నంపై కేసు నమోదు చేసిన ట్లు సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. 

దుబ్బాకలో..

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో బీఆర్‌ఎస్ కార్యకర్త దివిటి సాయికుమార్ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు అనుమానించిన మరో పార్టీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సాయికుమార్ నుంచి రూ.11,500 నగదు, ఓటరు లిస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.