నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన ఎం. వెంకట నర్సింహా రెడ్డిని శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, నూతన తహసీల్దార్‌కు శాలువా కప్పి సత్కరించి,
శుభాకాంక్షలు తెలిపి, మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ చొరవ చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అనంత్ రెడ్డి,బుచ్చి యాదవ్, బండారు రవీందర్, ఈశ్వర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్,పెంటయ్య,పార్టీ సీనియర్ నాయకులు మోహన్ కుమార్, మణిరం నాయక్,తవిటి ప్రశాంత్,ఖాజా, తిరుపతి రెడ్డి, శివ,మేడిపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, ఉదయ్ రాజ్ గౌడ్,బద్దం సాయి, వీరయ్య,కార్యకర్తలు పాల్గొన్నారు.




