10 April, 2026 | 6:45 PM

ఎన్నికలకు సర్వం సిద్ధం

13-05-2024 02:26 AM

సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన సిబ్బంది

అందరూ ఓటేయాలని పిలుపునిచ్చిన అధికారులు

మెదక్/సంగారెడి/సిద్దిపేట/యాదాద్రి భువనగిరి/రంగారెడ్డి/వికారాబాద్/మేడ్చల్ మల్కాజిగిరి , మే 12(విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రజలం తా ఓటింగ్‌లో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆదివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బం ది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నా రు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలింగ్ సిబ్బందిదేనని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఆదివారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆయ న పరిశీలించి మాట్లాడారు. 

నర్సాపూర్‌లో: నర్సాపూర్ పరిధిలోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పటాన్‌చెరులో: పటాన్‌చెరు నియోజకవర్గ ఐదు మండలాలలోని 411 పోలింగ్ కేం ద్రాలలో 1936 మంది అధికారులు, సిబ్బ ంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.

మెదక్ పరిధిలో 44 మంది అభ్యర్థులు

సిద్దిపేటలో: సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో కలిపి 9,66,330 మం ది ఓటు హక్కును వినియోగించుకోనున్నా రు. కరీంనగర్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 1152 పోలింగ్ కేంద్రా ల్లో 5897 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. మెదక్ పార్లమెంటు పరి ధిలో 44 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం మనుచౌదరి వెల్లడించారు. 

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా 

పార్లమెంటు ఎన్నికల పరిశీలనలో భాగం గా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, పక్కదారి పట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరితమైన, తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంగారెడ్డిలో: జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేందుకు బూత్‌ల వారీగా ఏర్పాట్లు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16,35,293 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

జహీరాబాద్‌లో: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కశాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె  పరిశీలించి మాట్లాడారు. 

భువనగిరి బరిలో 39 మంది..

యాదాద్రి భువనగిరిలో: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్ల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహణకు ఈవీఎంలు తదితర సామగ్రితో ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 2,141 పోలింగ్ కేంద్రాల్లో 18,08,585 మంది ఓట్లు వేయనున్నారు.

ఎల్బీనగర్‌లో: ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్త య్యాయి. ఆదివారం సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో పోలింగ్ కేంద్రాల అధికారులు, సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి తెలిపారు. 

మేడ్చల్‌లో: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. 3228 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందికి సామగ్రిని అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు 150 బస్సుల్లో పంపించారు. 

రంగారెడ్డిలో: ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డీఆర్‌సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిణి పంపిణీని సజావుగా చేపట్టారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక, ఎన్నికల పరిశీలకుడు రాజేందర్ కుమార్ కటారియాతో కలిసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు.

వికారాబాద్‌లో: జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డి సందర్శించారు. 1148 కేంద్రాల్లో పోలింగ్ జరగను న్నట్లు ఆయన తెలిపారు.

భారీగా పోలీస్ బందోబస్తు.. 

ఎన్నికల సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పా టు చేశామన్నారు.