2 June, 2026 | 5:36 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు ఆసిఫ్ అలీకి అరుదైన గుర్తింపు   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం   •   తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్   •   పార్లమెంట్‌లో నాటి 39 మంది బీఎస్పీ ఎంపీల మద్దతు వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం   •   తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సోనియా గాంధీ కృషి వల్లనే రాష్ట్రం ఏర్పాటు.   •   చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   ముఖ్యమంత్రి ప్రసంగం జిల్లా ప్రజలకు నిరాశ కలిగించింది   •   పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   నాగిరెడ్డిపేట్ మండలంలోని అన్ని జిపిలలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు   •   జెండా కోసం గొడవ.. వేడుకల్లో అపశృతి   •  

నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం

10-04-2026 08:13 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన మల్యాల దేవయ్య రెండవ కుమార్తె మల్యాల అలేఖ్య (29) ఏప్రిల్ బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. అయితే తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తండ్రి దేవయ్య లేచి చూసేసరికి అలేఖ్య ఇంట్లో కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన దేవయ్య వెంటనే కోనరావుపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువతి అదృశ్యం పై ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.