2 June, 2026 | 7:44 PM

Breaking News

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •  

శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ

10-04-2026 08:18 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పంచాయతీ కార్యదర్శి మజిద్ సయ్యద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా 0-6 సంవత్సరాల పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు ‘బాలమృతం ప్లస్’ అందజేస్తున్నట్లు తెలిపారు.అలాగే గర్భిణీలు బాలింతలు రక్తహీనత సమస్యలు లేకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామంలోని తల్లులు, వీవో ఈ. రాజేశ్వరి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు పుట్ట రేణుక తదితరులు పాల్గొన్నారు.