10 April, 2026 | 10:10 PM

అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి

10-04-2026 08:32 PM

సర్పంచ్ గేడం సునీత 

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామ ప్రజలందరికీ సహకారం భాగ్యస్వామ్యంతోనే గ్రామా భివృద్ధి సాధ్యపడుతుందని, ఖమాన గ్రామ సర్పంచ్ గేడం సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఫేస్ -2 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఖమాన  గ్రామంలోని అంబే ద్కర్ చౌరస్తా సమీపంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపడు తూ, తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి గ్రామ పంచా యతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలిస్తు న్నట్లు ఆమె తెలిపారు. కార్యక్ర మంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులున్నారు.