5 August, 2026 | 7:36 PM

రూ.8,889 కోట్ల నగదు సీజ్

20-05-2024 12:40 AM

ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు

ఎన్నికలు పూర్తయ్యే నాటికి మరింత పెరిగే ఛాన్స్

న్యూఢిల్లీ, మే 19 : సార్వత్రిక ఎన్నికల వేళ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యం పట్టుబడుతోంది. ఇప్పటి వరకు రూ. 8,889 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం స్వాధీనం చేసుకున్నామని ఆదివా రం ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే, 2009 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ మొత్తం విలువ రెం డున్నర రెట్లకు మించి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు పట్టుబడిన నగదులో సింహ భాగం డ్రగ్స్‌దేనని, దాదాపు రూ. 3,959 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిందని ఈసీ వివరించింది.

తెలంగాణలో రూ. 76 కోట్ల విలువైన 30 లక్షల లీటర్ల మద్యం, రూ. 114 కోట్ల నగదు, రూ. 29 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 77 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు వం టి విలువైన లోహాలను స్వాధీనం చేస్తుకున్నట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నిక ల పోలింగ్ నిర్వహిస్తుండగా.. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్త య్యింది. నేడు అయిదో దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యం లో ఇప్పటివరకు తనిఖీల్లో పట్టుబడిన నగ దు, ఇతర వివరాలను ఆదివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఏడు దశల్లో పోలిం గ్ పూర్తి అయ్యే నాటికి తనిఖీల్లో పట్టుబడే సంపద మరింత పెరగనుంది.