5 August, 2026 | 8:33 PM

గెలిస్తే సినిమాల్లో నటించను

20-05-2024 12:39 AM

బాలీవుడ్ నటి కంగనా

న్యూఢిల్లీ, మే 19: తాను ఎంపీఆ ఎన్నికల్లో గెలిస్తే సినిమాలు చేయబోనని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఎన్నో విజయా లు సాధించానని, నటిగా ఎన్నో అవార్డులు గెలిచానని గుర్తుచేసుకున్నారు.  మండి స్థానం నుంచి గెలిస్తే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్టు వివరించారు. ఎంపీ గా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో కొనసాగాలని చా లా మంది నిర్మాతలు కోరుతున్నట్లు చెప్పారు.