15-11-2025 12:01:01 AM
వ్యతిరేకిస్తే వేధింపులు, సాధింపులు...
మహిళ గ్రూపులపై ఆర్పీల చేతివాటం
ప్రతీ రుణంలో కమీషన్ తప్పనిసరి
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 14: ఐకేపీ మహిళా పొదుపు గ్రూపులపై ఆర్పీలు, సీఏల ఆగడాలు అంతా ఇంతా కాదు... గ్రూపులకు వస్తే ఇక పండుగే వాళ్లకు... పొదుపు సంఘాల పర్యవేక్షణ బాధ్యతల మాటున ఆర్పీలు చేతి వాటానికి అంతులేకుండా పోయింది.
ఎప్పటికప్పుడు తమకు అప్పగించిన పొదుపు మహి ళా గ్రూపులను మోటివేషన్ చేస్తూ ఆర్థిక వికాసానికి తోడ్పాటు అందించాల్సిన ఆర్పీలు అక్ర మ వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు వారిపై ఉన్నాయి. రుణాలు తీసుకున్న గ్రూపులను వాయిదా పద్ధతిలో చెల్లింపులు సక్రమం గా జరిగే విధంగా ఆర్పీలు ప్రధాన బాధ్యత నిర్వహించాలి. ఇది వారి పై ఉన్న భూమిక.
లక్షకు రూ. 2 వేల కమిషన్...
రుణాలు మంజూరయ్యాయంటే గ్రూపు సభ్యుల కంటే ఆర్పీలకే పండుగ... లక్ష రూపాయల రుణానికి రూ.2వేల కమిషన్ ఇవ్వాల్సిం దే... రుణం రావడానికి కృషి చేస్తున్నామని అనుభవంతో గ్రూపుల నుంచి ఇలా ముడుపులు పట్టిస్తున్నారు. ఒక్కో ఆర్‌పీకి కనీసం కనీసం 20లోపు గ్రూపులు వారి పర్యవేక్షణ లో ఉంటాయి. ఇలా రుణాలు కోసం మహిళా సంఘాల సభ్యులు వస్తే ఆర్పీలకు కాసుల వర్షం కురుస్తుంది.
శ్రీనిధి రుణాల్లోనూ కమిషన్లు...
పావలా వడ్డీ రుణంతో పాటు గ్రూపు మహిళలకు మరో రుణ సాదుపాయం శ్రీనిధి రుణాలు కూడా ఉంటాయి. రుణాలు పొంది న ప్రతి గ్రూపు సభ్యురాలు నెలకు చెల్లించే లోన్ బకాయికి అదనంగా కనీసం రూ. 500 లోపు ఆర్‌పీలు తీసుకుంటారు. ఒక వేల వ్యతిరేకిస్తే రుణాలు ఇవ్వరూ... కక్షసాధింపు చర్యల కు దిగుతారని సభ్యులు భయపడతారు.
ఇలా ఆర్పీల కనుసన్నల్లో ప్రతీదీ ఉంటుంది. తమ దయాదాక్షిణ్యాలతోనే గ్రూపు మహిళలు రుణాలు పొందుతున్నట్టు ఆర్పీలు ఫీలవుతారని సభ్యులు వాపోతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పొదుపు సం ఘాల పర్యవేక్షణ పేరిట సిఏలు ఆర్పీల మాది రే దండుకుంటున్నారు. ప్రతిలోను ఓ లెక్క ప్రకారం డబ్బులు వసూలు చేస్తున్నారు. రుణాలు వచ్చినప్పుడూ ఆర్పిలు, సీఏలకు సం బంధించిన గ్రూపుల నుంచి వచ్చే లావాదేవీల వసూళ్ల బాధ్యత గ్రూప్ లీడర్లే వహిస్తారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు...
రుణాలు వచ్చినపుడూ ఆర్పీలు కమిషన్ తీసుకుంటున్నట్టు సభ్యులు ఫిర్యాదు చేస్తే సమాఖ్య సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేసి ఆర్పీలపై చర్యలు తీసుకుంటాం. రుణాల వ్యవహారంలో డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం మాత్రం ఉన్నది. అధికారికంగా తన దృష్టికి రాలేదు. రుణాల కోసం సభ్యులు ఎవరూ ఆర్పీలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే సభ్యులు తన దృష్టికి తీసుకువాలి.
దుర్గయ్య, టీఎంసీ కోఆర్డినేటర్