22-05-2025 11:05:54 PM
పవర్ ప్రాజెక్టు టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు..
ఇప్పటికే మాజీ గవర్నర్ నివాసాల్లో సోదాలు..
ఆసుపత్రిలో ఉన్నానని ఎక్స్‌లో పేర్కొన్న సత్యపాల్ మాలిక్..
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Former Governor Satya Pal Malik)పై సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ పవర్ ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే సత్యపాల్ మాలిక్ నివాసాల్లో సోదాలు జరిపిన సీబీఐ తాజాగా ఆయనతో పాటు మరో ఐదుగురి పేర్లను కూడా చార్జిషీటులో పేర్కొంది. కిష్తార్‌లో ఏర్పాటు చేసిన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు టెండర్ల విషయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండగా.. సీబీఐ 2022 నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. సత్యపాల్ మాలిక్ 2018 మధ్యలో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఇప్పటికే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించిన సత్యపాల్ మాలిక్.. సీబీఐ చార్జిషీట్ వేయడంపై కూడా స్పందించారు. ఆసుపత్రిలో ఉన్నట్టు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.