ఎమ్మెల్యేలనందరినీ రైతు ఉత్సవానికి ఆహ్వానించిన మంత్రి తుమ్మల
19-03-2026 12:24 AM
- అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులను కలిసి స్వయంగా
ఆహ్వానం అందచేసిన మంత్రి తుమ్మల
సత్తుపల్లి, మార్చి 18. (విజయక్రాంతి) : ఈ నెల 19వ తేది సాయంత్రం 4 గంటలకు నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ దగ్గర ప్రారంభం కానున్న రైతు ఉత్సవాల.22 వరకు కొనసాగనున్న రైతు ఉత్సవాలు, రైతుల కోసం 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులందరికీ రైతు ఉత్సవానికి రావాల్సిందిగా మంత్రి తుమ్మల ఆహ్వానించారు. అదేవిధంగా స్పీకర్ ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.




