23-05-2025 12:00:00 AM
వాషింగ్టన్, మే 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తీరు మార్చుకోవట్లేదు. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పం దానికి తానే కారణం అని ఇప్పటికే పలు మార్లు ప్రకటించుకున్న ట్రంప్ మరోమారు అవే వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో కూడా తానే భారత్-పాక్‌ల కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్టు చెప్పారు.
ఈ రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలను తగ్గించేందుకు వాణిజ్య ఒప్పందాలను ప్రయోగించినట్టు ప్రకటించారు. త్వరలోనే భారత్, పాకిస్థాన్ తో భారీ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిపారు. యుద్ధం అనేది చిట్టచివరి ప్రయత్నం మాత్రమే కావాలని తాను కోరుకుంటున్నట్టు వివరించారు.