విశాఖలో దారుణం... ఆరేళ్ల విద్యార్థి మృతి
విశాఖపట్నం: విశాఖలో దారణం ఘటన జరిగింది. టీచర్ కొట్టడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల ప్రణయ్ తేజ్ అనే బాలుడు ఎల్కేజీ చదువుతున్నాడు. విద్యార్థి హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించి, కోట్టడంతో తేజ్ కుప్పకూలి టీచర్ పై పడిపోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికి అప్పటికే విద్యార్థి చనిపోయాడని వైద్యులు తెలిపారు. విద్యార్థి తేజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
విషయం తెలిసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన స్కూల్ కు చేరుకొని ఆందోళన దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థిలికి చేరుకొని తరగతి గదిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ బాలుడు భయంతో కూడిన ముఖకవళికలతో వరుసలో నిలబడి ఉండటం కనిపిస్తుంది. టీచర్ బాలుడి యూనిఫామ్‌ను సరిచేస్తుండగా ఏడవడం మొదలుపెట్టాడు, ఆ వెంటనే టీచర్ అతన్ని కొట్టడం, ఆ దెబ్బకు బాలుడు వెంటనే కుప్పకూలి ఉపాధ్యాయుడిపై పడిపోవడం వంటివి దృశ్యాలలో కనిపిస్తుంది. కేజీహెచ్ కలో బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థిని కొట్టిన టీచర్తో పాటు స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.






