calender_icon.png 14 May, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఎస్‌ఈ పదవ తరగతి పబ్లిక్

14-05-2025 01:31:08 AM

 ఫలితాల్లో ‘హార్వెస్ట్’ దే అగ్రస్థానం

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 13 (విజయక్రాంతి): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి.బి. ఎస్.ఇ బోర్డు) వారు దేశవ్యాప్తంగా నిర్వహించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తమ విద్యార్థినీ విద్యార్థులు తిరుగులేని విజయాలు సాధించి అగ్రశ్రేణిలో నిలిచారని హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

2024-25 విద్యాసంవత్సరానికి గాను సి.బి.ఎస్.ఇ బోర్డు వారు నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో తమ పాఠశాల నుండి 250 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షకు హాజరవగా, మంగళవారం విడుదల చేసిన ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. తమ విద్యార్థి కె. రిషిత్ 492/500 మార్కులు సాధించి పాఠశాల అగ్రస్థానంలో నిలిచారన్నారు.

ఎస్.తేజస్వీ 489/500, బి. హిమవర్షిని 487/500, ఎం. ధన్విత 485/500, బి.చందన  483/500, 25.3. 2 483/500,481/500, 2. 480/500, 5.5 480/500 సాధించడం హర్షనీయమన్నారు.తమ విద్యార్థులు తెలుగులో ఎ1 గ్రేడ్ 59 మంది, హిందిలో ఎ1 గ్రేడు 11 మంది, ఇంగ్లీషులో ఎ1 గ్రేడు 100 మంది, గణితంలో ఎ1 గ్రేడ్ 96 మంది, సైన్స్లో ఎ1 గ్రేడ్ 73 మంది, సోషల్లో ఎ1 గ్రేడ్ 31 మంది సాధించడం గర్వకారణమన్నారు. తమ విద్యార్థులు 470 మార్కులకు పైగా 26 మంది, 450 మార్కులకు పైగా 76 మంది సాధించడం జరిగిందన్నారు. మంగళవారం పాఠశాల ఆవరణలో ’హార్వెస్ట్’ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్. పార్వతీరెడ్డి  విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.