calender_icon.png 14 May, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఎస్‌ఈ ఫలితాల్లో.. న్యూ ఇర వారి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థుల ప్రభంజనం

14-05-2025 01:29:19 AM

పది, పన్నెండులో  నూరు శాతం ఫలితాలు..

విద్యార్థులను అభినందించిన విద్యాసంస్థ  కరస్పాండెంట్ పి. భూమేష్ రావు 

 వైరా, మే 13 (విజయక్రాంతి): సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూ ఢిల్లీ వారు మే 13న ప్రకటించిన పది,  పన్నెండు ఫలితాలలో న్యూ ఇర న్యూ లిటిల్ ఫ్లవర్ వైరా  విద్యార్థులుఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డా. పి. భుమేష్ రావు   అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. 

10వ తరగతి ఫలితాలలో మొత్తం 172 మంది విద్యార్థులు హాజరు కాగ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా బండి రమ్యశ్రీ, ఏలూరి త్రియ 500 మార్కులకు గాను 482 మార్కులతో 97 శాతం సాధించారు. గూడూరు ఊహిత, అంచూరి అంజలి (96%), డి. సాత్విక చౌదరి (95%), మేడా చర్విత, మణికంట, మేఘన (94%)  సాధించారు.

ఇంకా 22 మంది విద్యార్దులు 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతి ఫలితాలలో మొత్తం 48 మంది విద్యార్థులు హాజరు కాగ 100 శాతం ఉత్తీర్ణతతో 31 మంది  విద్యార్థులు మొదటి శ్రేణిలో, మిగతా వారు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా 500 మార్కులకు గాను 450  మార్కులతో (90 %) బోజెడ్ల తేజశ్రీ మొదటి స్థానంలో నిలిచారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ డా. పి. భుమేష్ రావు  మాట్లాడుతూ పది ఫలితాలలో కనీవిని ఎరుగని రీతిలో ఫలితాలను సాధించారని మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థులు పట్టుదలగా అకుంటితమైన దీక్షతో అత్యధికమైన మార్కులను సాధించి మన పాఠశాలను, కళాశాలను   రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలుపటం జరిగిందని,ఇటువంటి ఫలితాల కోసం న్యూ లిటిల్ ఫ్లవర్ నిరంతరం కృషి చేస్తుందనన్నారు.

ఈ కార్యక్రమంలో న్యూ ఇరా విద్యాసంస్థల ఛైర్మన్ ఐ. వి. రమణా రావు , కరస్పాండెంట్ డా. పి. భుమేష్ రావు , డైరెక్టర్స్ డా.కాపా మురళీ కృష్ణ, కుర్రా సుమన్, లగడపాటి ప్రభాకార్ , స్కూల్ ప్రిన్సిపల్ షాజీమాథ్యూ, ఎ.ఓ నరసింహరావు  ఉపాధ్యాయులు విద్యార్థిని విధ్యార్థులను అభినందిచారు.