1 March, 2026 | 7:49 PM

పరీక్షలను వాయిదా వేసిన సీబీఎస్‌ఈ

01-03-2026 05:44 PM

దుబాయ్: ప్రస్తుత పరిస్థితుల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో మార్చి 2న జరగాల్సిన 10, 12 తరగతుల వార్షిక బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆదివారం ప్రకటించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాలలో పరీక్షలు వాయిదా పడ్డాయని సీబీఎస్‌ఈ పాఠశాలలకు పంపిన సర్క్యులర్‌లో పేర్కొంది.

పరీక్షలు వాయిదా పడిన జాబితాలో ఇరాన్ కూడా ఉందని, కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటనలో తెలిపింది. మార్చి 3న పరిస్థితిని సమీక్షించి మార్చి 5 నుండి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లిడించింది. భారతదేశం వెలుపల ఉన్న అతిపెద్ద బ్లాక్ గల్ఫ్ ప్రాంతం, ఇక్కడ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు భారతీయ ప్రవాసుల పిల్లల అవసరాలను తీర్చడానికి పనిచేస్తున్నాయి.