17 August, 2026 | 1:14 AM

పుల్లూరులో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

17-08-2026 12:42 AM

రూ.4 లక్షల వి.బి.జీ. రామ్జీ నిధులతో నిర్మాణ పనులు ప్రారంభం

సిద్దిపేట రూరల్, ఆగస్టు16: మండలంలోని పుల్లూరు గ్రామంలో వి.బి.జీ. రామ్జీ నిధుల నుంచి రూ.4 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ కుంచం లత వెంకట్ యాదవ్, ఉపసర్పంచ్ ఒగ్గు రాజేష్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.