15 June, 2026 | 1:26 AM

పొనుగోడులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

15-06-2026 12:00 AM

గరిడేపల్లి, జూన్ 14 :మండలంలోని పొ నుగోడు గ్రామంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాల ఉత్తంకుమార్ రె డ్డి సహకారంతో మంజూరైన 20 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ఆదివారం గ్రామ సర్పంచ్ కటకం వేణు ప్రారంభించా రు. గ్రామంలో కనీస వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సర్పంచి వేణు తెలిపారు. మంత్రి సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులను చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కటకం రమేష్, నేలపట్ల వెంకటేశ్వర్లు, కటకం లక్ష్మీనారాయణ, ఏడి పాల నాగమణి, చామకూరి గురుస్వామి, కటకం గోపయ్య తోపా టు వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.