17 April, 2026 | 3:08 AM

చౌదరిగూడలో సీసీ రోడ్లకు శ్రీకారం

17-04-2026 12:00 AM

గ్రామాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

శంషాబాద్. ఏప్రిల్ 16(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలో రూ.29 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సి.ఆర్.ఆర్ నిధుల కింద మంజూరైన రూ.29 లక్షలతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఈ సీసీ రోడ్లను ఆధునిక ప్రమాణాలతో నిర్మించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గతంలో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న తమ వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించ డంపై గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.