calender_icon.png 25 May, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సీసీఆర్ సభ్యునికి చోటు..

24-05-2025 10:37:26 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్(SC ST Social Welfare) జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సీసీఆర్ సభ్యునికి చోటు కల్పించడంపై జిల్లా సీసీఆర్ కమిటీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో మానవ హక్కులు సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత గూర్చి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రేట్స్ అనే సంస్థ నిస్వార్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇట్టి సంస్థలో చురుకుగా పాల్గొంటున్న జుక్కల్ నియోజకవర్గానికి చెందిన వసంత్ జాదవ్ పార్టీని జిల్లా మానిటరింగ్ కమిటీలో సభ్యుడుగా ఎంపిక చేసినందుకుగాను అతడిని తోటి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో వసంత జాదవ్ మాట్లాడుతూ జిల్లా కమిటీ లో తన ఎంపిక చేసినందుకు గాను ప్రత్యేకంగా కలెక్టర్కి జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇటువంటి అవకాశం వచ్చేలా ప్రోత్సహించినందుకు అన్ని విధాలుగా సహకరించిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రేట్ సంస్థ వ్యవస్థాపకుడు మంచి కట్ల అనిల్ కుమార్ కి అలాగే జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జోనలి ఇంచార్జ్ కరీముద్దీన్, జిల్లా ఇంచార్జ్ శ్రావణ్ కుమార్, ముత్యాల అశోక్ భాస్కర్ బాల్రాజ్ పాల్గొనడం జరిగింది..