24-05-2025 10:34:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రయాణికుల సేవి ప్రథమ కర్తవ్యంగా టీజీ ఆర్టీసీ ప్రజల అభిప్రాయాలు కనుగుణంగా బస్ సర్వీస్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. శనివారం డయల్ యువర్ డిఎం లో వచ్చిన ప్రశ్నలకు జవాబులను అందించారు. నిర్మల్ డిపో పరిధిలోని గుమ్మిరాల నుండి ఏరుగట్ల వరకు బస్సు నడపాలని పిట్టాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలని నిర్మల్ బైంసా రూట్లో రద్దీకి అదనంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, గడిచందాకు బస్సు టైమింగ్లు మార్చాలని. ఓలా కుంటాలకు అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లు వచ్చినట్టు ఆయన తెలిపారు. వీటిని పరిశీలించి తప్పకుండా న్యాయం జరిగినట్లు చూస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.