calender_icon.png 12 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్టిఫికెట్లు ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా.. పొజిషన్ చూపించరా..?

12-08-2025 12:00:00 AM

రెవెన్యూ కార్యాయం ఎదుట జిన్నారం, జంగంపేట రైతుల ధర్నా

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 11 : మా నుంచి భూములు తీసుకొని పరిహారంగా ఎకరాకు ఆరు వందల గజాల స్థలం సర్టిఫికేట్లు ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు పొజిషన్ చూపిలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇచ్చిన సర్టిఫికేట్లకు పొజిషన్ చూపించాలని డిమాండ్ చేస్తూ జిన్నారం రెవెన్యూ కార్యాలయం ఎదుట జిన్నారంలోని సర్వేనంబర్ ఒకటి, జంగంపేటలోని సర్వేనంబర్ 376 రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు.

రైతుల ధర్నాకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గోవర్దన్ రెడ్డి, జిన్నారం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్లు పార్టీ నాయకులతో  కలిసి రైతులకు మద్దతుగా రెవెన్యూ కార్యాలయం ఎదుట భైటాయించారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బాల్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం టీజీఐఐసీ ద్వారా అప్పటి ప్రభుత్వం జిన్నారం, జంగంపేట గ్రామాలలో రైతుల నుంచి 180 ఎకరాలు తీసుకుందని, పరిహారంగా ఎకరాకు ఆరు వందల గజాల స్థల సర్టిఫికేట్లను అప్పటి ఎమ్మెల్యే, ఆర్డీవో ఇతర అధికారులు అందజేశారని చెప్పారు. కాగా సర్టిఫికేట్లు ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు వాటికి పొజిషన్ చూపించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైగా  జిన్నారంలో రైతుల నుంచి తీసుకున్న భూముల నుంచి మట్టి తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. తక్షణం రైతులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకులు తహసీల్దార్ దేవదాసును కలిసి వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. స్పందించిన తహసీల్దార్ పదిహేను రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వావిలాల పీఏసీఎస్ చైర్మన్ శంకర్ రెడ్డి, మాజీ సర్పం లు ఖదీర్, వెంకటయ్య, నాయకులు సార నరేందర్, ప్రభాకర్ రెడ్డి, నీలం మోహన్,  శ్రీనివాస్ గౌడ్, చెక్క క్రిష్ణాగౌడ్, బ్రహ్మేందర్ గౌడ్,  రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, మల్లేశ్, నిల్ గౌడ్, రైతులుపాల్గొన్నారు.