calender_icon.png 23 February, 2026 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల అదుపునకు సీసీ కెమెరాలు దోహదం

23-02-2026 12:00:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి):  నేరాలను అదుపు చేయడంలో సీసి కెమె రాలు కీలక పాత్ర పోషిస్తాయని, కాలనీలు, బస్తీ సంఘాలు ముందుకు వచ్చి తమ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, దోమలగూడ పీఎస్ సీఐ అంజద్ అలీ సూచించారు. సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు చేసే వారిని త్వరగా గుర్తించవచ్చని, తద్వారా నేరాలు అదుపులో ఉంటాయని వారన్నారు.

ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ పూల్‌బాగ్‌లో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కల్వ నితీష్ కుమార్ తన సొంత ఖర్చులతో 18 సీసీ కెమరాలను ఏర్పాటుచేశారు. యువజ్యోతి కాలనీ బస్తీ అధ్యక్షురాలు కల్వ సునీత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, దోమల గూడ సీఐ అంజద్‌అలీ, బీఆర్‌ఎస్ నగర నాయకులు కల్వ గోపిలు సీసి కెమరాలను ప్రారంబించారు.

ఈ కార్యక్రమంలో సీఐ అంజద్ అలీ, అనంతరం కల్వ నితీష్, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ముఠా జైసింహ, బస్తి సంక్షేమ సంఘం చైర్మన్ కల్వ శంకర్, ప్రధాన కార్యదర్శి సతీష్, బీఆర్‌ఎస్ నగర నాయకులు కల్వగోపి, బస్తీ వాసులు కల్వ శ్రవణ్, నాగరాజు, లక్ష్మణ్, మహేష్ కుమార్, వినోద్, సాయినాథ్, నవీ న్, శ్రీనివాస్, బీఆర్‌ఎస్ డివిజన్ ఆధ్యక్ష కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్ డీ. సాయికృష్ణ,  బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.