calender_icon.png 26 August, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం

26-08-2025 09:18:42 PM

గాంధారి,(విజయక్రాంతి): నేరరహిత  సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం అని  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  అన్నారు.  మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎంట్రీ, ఎగ్జిట్, ముఖ్యమైన చౌరస్తాలలో, గ్రామంలో 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయి అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు, నేరరహిత  సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ప్రజలకు భద్రత, సెన్సాఫ్  ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని, నేరాలను నియంత్రించడంలో నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి.

సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో నేరాల అదుపు చేయడానికి పోలీసులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.  నేరస్తుడు నేరం చెయ్యలేను అని చెప్పినా సీసీ కెమెరాలు చూపించినచో  తను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరుగుతుందన్నారు. సీసీ కెమెరాలు ఉన్న ఇండ్లలో కాలనీలలో గ్రామాలలో నేరస్తులు నేరం చేయడానికి భయపడతారని తెలిపారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో సీసీ కెమెరాలు ఉండి పనిచేయని సిసి కెమెరాలు విషయంలో నూతన సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.

ప్రజలు కూడా ఇంటి ఆవరణలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జియోట్యాగింగ్‌ ద్వారా కామారెడ్డి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసే తర్వాత హైదరాబాద్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా  షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఒక కెమెరా రోడ్డు వైపు పెట్టుకోవాలని సూచించారు. వ్యాపారస్తులు ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టి షాపులు పెడతారు 20 నుండి 30 వేల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు.

ఏదైనా జరగరాని సంఘటన జరిగినా దొంగతనం జరిగిన  నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను,   వివిధ సంఘాల నాయకులను,  ప్రజా ప్రతినిధులను అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను,   వివిధ సంఘాల నాయకులను,  ప్రజా ప్రతినిధులను, గ్రామ అభివృద్ధి సంఘం, క్లాత్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, కిరాణా వర్తక సంఘం, ఫర్టిలైజర్స్ అసోసియేషన్, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్, అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను మాజీ సర్పంచ్  సంజీవ్, మాజీ MPTC లు తూర్పు రాజు, శ్రీనివాస్, VDC నాయకులు మల్లేష్, సాయిలు, నాయకులు సాయికుమార్, బెజుగం సంతోష్, సత్యం లను అభినందించి  సన్మానించారు. అలాగే ఇట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటలో ముఖ్యపాత్ర వహించిన SI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ రవి, సంజయ్ లను  SP  అభినందించినారు.