26-08-2025 11:41:02 PM
ఆస్పత్రి పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వాస్పత్రి వైద్యులపై ఎంఎల్ కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆస్పత్రి ప్రాంగణానికి ఆకస్మికంగా తనిఖీ చేసి,ఆస్పత్రి వరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి, ఆస్పత్రి నిర్వహణలోపంపై మండిపడ్డారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పలు మార్లు హెచ్చరించానని, వరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి పద్దతుల్లో ఉండటం సరైంది కాదని అసహనం వ్యక్తం చేశారు.
ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. సిబ్బంది వనితీరు, పద్దతుల వలన చెడ్డపేరు వస్తుందని, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడు తోందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. చిన్న చిన్న కేసులను కూడా ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్నాయని, జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను వేరే ప్రదేశాలకు రిఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
ఇక్కడి సిబ్బంది రోగులకు వైద్యం అందించాలికదా, వైద్య సిబ్బంది, మందులు, వైద్యపరికరాల కొరత లేనప్పుడు ఎందుకు రిఫర్ చేస్తున్నారని నిలదీశారు. వైద్యవృత్తికి కట్టుబడి సేవాదృక్పదంతో పనిచేయాలని , మొక్కుబడి ఉద్యోగాలు చేస్తామంటే చర్యలు తప్పవన్నారు. ఇకనైనా వద్దతి మార్చుకొని పనిచేయాని, ఉద్యోగుల పనితీరు, ఆస్పత్రి నిర్వహణలో లోపాలు పునరావృతమైతే చర్యలకు సిఫారసు చేస్తానన్నారు.