26-08-2025 11:35:09 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి నిరక్షరాస్యుల సంఖ్యను గణనీయంగా తగ్గించి, ప్రజలను సాధికారతవైపు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కేసముద్రం ఎంపీడీవో క్రాంతి కోరారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల విద్యాధికారి కాలేరు యాదగిరి అధ్యక్షతన కేసముద్రం స్టేషన్ జడ్పీ హైస్కూల్ లో అండర్స్టాండింగ్ లైఫ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ ఏ సొసైటీ (యుఎల్ఎల్ఏఎస్) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో క్రాంతి మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలుపరిచి 2027 వరకు నిరక్షరాస్యతను నిర్మూలించాలని కోరారు. ఎంఈఓ యాదగిరి మాట్లాడుతూ వయోజన విద్య ప్రాముఖ్యత, అందులో ఉపాధ్యాయులు, వివోఏ ల భాగస్వామ్యం గూర్చి వివరించారు. గ్రామస్థాయిలో వాలంటరీ టీచర్లకు శిక్షణను సమర్థవంతంగా ఇచ్చి ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.