26-08-2025 11:45:14 PM
ప్రత్యేక అధికారి ఎస్.పంకజ
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య సిబ్బంది కి ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎస్. పంకజ పారిశుధ్య పరికరాలు, గ్లౌస్ లు, మాస్కులు, సబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరి నూనె, రెండు జతల బట్టలు, సేఫ్టీ షూ, చెప్పులు ఇతర సామాగ్రీ కమీషనర్ ఎ. శైలజా, అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ ఇ. శ్యామ్ సుందర్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ బి.నారాయణ రెడ్డి తో కలిసి అందచేయడం జరిగినది. ఈ సందర్భముగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల భద్రత, శ్రేయస్సు ప్రాధాన్యత ను ఇస్తూ వారికి అవసరమైన పరికరాలు అందజేశామని తెలిపారు.
మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్. పంకజ సూచనలతో మట్టి గణపతులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారముతో అందచేయడం జరిగినది.అదే విధముగా మణికంఠ కాలనీ యందు దాతల సహకారముతో ప్రత్యేక అధికారి,కమీషనర్ చేతుల మీదుగా కాలనీ అసోసియేషన్ తో కలసి మట్టి గణపతులు అందచేయడం జరిగినది.