7 May, 2026 | 2:31 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం

07-05-2026 01:31 PM

చౌటుప్పల్, మే 7(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఏటువంటి బాధ లేదని ఈ ప్రభుత్వంలో యూరియా, రైతుబంధు, సాగునీరు, పండిన పంటను అమ్ముకోవాలన్న ఇబ్బందికరంగానే ఉందని అన్నారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలు అడగగా సుమారు 24 రోజులు అవుతున్న వడ్లు  కొనే దిక్కు లేదు, మ్యాచర్ పాసైన వడ్లు జోకే నాథుడు లేడు,  అలాగే తరుగు పెడితే బస్తాకు మూడు కిలోల కోత పెడుతున్నారని వాపోయారు.