18 June, 2026 | 9:08 AM

గోపాల్పేట్ గ్రామ ఎస్సీ కాలనీకి సరిహద్దులు చూయించండి

18-06-2026 08:30 AM

నాగిరెడ్డిపేట్,జూన్ 18 (విజయ క్రాంతి): మండలంలోని గోపాల్పేట ఎస్సీకాలనీ ప్రక్కన కొత్తగా వెంచర్ డెవలప్మెంట్ జరుగుతుంది.కావున గోపాల్పేట గ్రామ ఎస్సీ కాలనీకి సంబంధించిన సరిహద్దులు మరియు రోడ్డు చూపించిన తరువాతే వెంచర్కు అనుమతులు ఇవ్వాలని,అప్పటివరకు వెంచర్ నిర్మాణం పనులు నిలిపివేయాలని కోరుతూ గోపాల్పేట్ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కాలనీవాసులు గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్కు మరియు గ్రామ కార్యదర్శి రాజుకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఆత్మకూరు బాబురావు, నవీన్,అరుణ్,బాబు, నాగంపల్లి బాలరాజ్,నీలం బాలమ్మ,నీలం ఎల్లమ్మ, రాజమ్మ,రాములు,గోపాల్, పోచయ్య,రాములు తదితరులు ఉన్నారు.