calender_icon.png 6 December, 2024 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

08-11-2024 05:24:58 PM

చేర్యాల (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అనుసంధానంగా నడిచే వేద పాఠశాల విద్యార్థులకు, భక్తులకు పళ్ళను పంపిణీ చేశారు. రాజగోపురం ముందు కేకును కట్ చేశారు. అదేవిధంగా చేర్యాల పాత బస్టాండ్ వద్ద పార్టీ కార్యకర్తలు సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొమ్ము రవి మాహా దేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 6 గ్యారంటీల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి శ్రీకాంత్, ఆగం రెడ్డి, మెరుగు శ్రీనివాస్ గౌడ్, జహీరుద్దీన్, బత్తిని నరసింహులు, సానాది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.