calender_icon.png 12 February, 2026 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో 76.26 శాతం పోలింగ్

12-02-2026 09:49:31 AM

స్వల్ప సంఘటనలు మినహా అంతా ప్రశాంతం

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ రోహిల్దారాజు

ఆశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట మునిసిపాలిటీలో జరిగిన పోలింగ్ 76.26శాతం ఓట్లు పోలయ్యాయి. మునిసిపాలిటీలో మొత్తం  23 వార్డులు, 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. మొత్తం ఓట్లు 16,850 ఉన్నాయి. వీటిలో మహిళలు 8761 పురుషులు 8085 ఇతరులు 4గురు ఉన్నారు. ఇందులో పోలైన ఓట్లు 76.26శాతం అనగా 12,849 ఓట్లు పోలయ్యాయి. 15వ వార్డులో అత్యధికంగా 703 ఓటర్లు ఉండగా, 607నుంచి ఓట్లు  పాలయ్యాయి.

పోలింగ్ శాతం 86.34శాతం ఓటు పోలయ్యాయి. ఆత్యల్పల 12వ వార్డులో 732 ఓటరుకు 461 ఓట్లు 62.98 శాతం ఓటు పోలయ్యాయి. ఉదయం 7గుల నుండి సాయంత్రం 5గంల వరకు పోలింగ్ సమయం ఉండటం, ప్రతి వార్డులో 700 ఓట్లు లోపే ఉండటంతో ఓటర్లు విడివిడిగా పోలింగ్ స్టేషనుకు చేరారు. దీంతో పోలింగ్ బూతు ల పద్ద పెద్దగా రద్దీ కనిపించలేదు .22 వార్డులలో కొన్ని వార్డులలోనే వీల్ చైర్స్ అందుబాటులో ఉంచటంతో మిగిలిన వార్డులో వృద్ధులు, విక లాంగులను సత్వరము మళ్ళడానికి ఇబ్బంది పడ్డారు వీల్ చైర్ ఉన్న చోట మునిసిపాలిటీ సిబ్బంది వృద్ధులను వీల్ చైర్ లలో బూతపల వ ద్దకు చేర్చారు. పోలింగ్ స్టేషన్లవద్ద ఓటర్లకు సహాయంగా ఉండేందుకు హెల్స్ డెస్క్,వైద్యశిబిరాలు, మంచి నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసారు. 11వ వార్డులో ఓ పోలింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రత్యర్థులు పిర్యాదు చేయడంతో ఆ అధికారిని రిజర్వులో పెట్టారు. 8వ వార్డులో కొందరు ఓటరు జాబితాను బయటకు తీసుకొచ్చారంటూ ప్రత్యర్థులు అభ్యంతరం తెలపడంతో మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది దొంతికుంట ప్రాథమిక పాఠశాల రహదారి ఇరుకుగా ఉండటంతో కేంద్రానికి వెళ్ళడానికి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.

4వ  వార్డు లో పార్వతి అనే వృద్ధురాలు కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆంబులెన్స్లో నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎస్సీ రోహిత్ రాజు పోలింగ్ స్టేషన్లును పరిశీలించారు. డీఎస్ పై రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ బూతల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. పోలింగ్ బూత్లలో ఓటు తక్కువగా ఉండ టంతో పోలింగ్ బూత్లవద్ద పెద్దగా క్యూలు కనిపించలేదు పోలింగ్ ప్రారంభమైన తరువాత కూడా మధ్యాహ్నం వరకు ఓటర్లకు డబ్బులు  పంపిణీ జరిగింది.

సుదూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను, వివిధ వార్డులో ఉన్న ఓట్లు ఉండటంతో పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చేందుకు అభ్యర్థులు నానా యాతన పడ్డారు. ప్రతి వార్డులో కూడ పట్టణంలోని లో ఓటరు ఉంచటంతో ఓటర్లను సమీకరించుకోవడం ఇబ్బందిగా మారింది ఒకే పటుంభంలోని ఓటు వేరం వేరు వార్డులో చేరాయి. జిల్లా సహాయ ఎన్నికల అధికారి మునిసిపల్ అధికార్ నాగరాజు అద్వర్యంలో ఎన్నికల నిర్వహణ  పకడ్బందీ గా వ్యవహరించారు కొందరు  బెంగళూరు ,చెన్నై నుండి కూడ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో అభ్యర్థులు మద్దతుదారులతో పోలింగ్ స్టేషను పరిసరాలు ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున సందడి నెలకొంది.