వేర్ ఎవర్ యూ గో..
15-02-2025 12:00 AM
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘-వేర్ ఎవర్ యు గో..’ సాంగ్‌ను స్టార్ హీరో మహేశ్‌బాబు లాంచ్ చేశారు. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు.






