1 August, 2026 | 1:05 AM

సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ

01-08-2026 12:14 AM

మహేశ్వరం జులై 31 (విజయక్రాంతి): మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ఎన్. శుభాషిణి అధ్యక్షతన శుక్రవారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ పరిధిలోని రోడ్ల దుస్థితి, తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ, వీధిదీపాలు, రెవెన్యూ సమస్యలతో పాటు విద్యా వ్యవస్థ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పలు కీలక అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సర్పంచులు ప్రస్తావించిన సమస్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించగా, ప్రజా సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శారదమ్మ, డీఎల్పీఓ సామీ రెడ్డి, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.