థ్రిల్లింగ్ డార్క్ నైట్
పూర్ణ ప్రధాన పాత్రలో పీ19 ట్రాన్స్‌మీడియా స్టూడియోస్ పతాకంపై పటోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేశ్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రం ‘డార్క్ నైట్’. ఈ చిత్రానికి జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) ప్రధాన పాత్రల్లో నటించగా విధార్థ్, సుభాశ్రీ రాయగురు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం థ్రిల్లర్ కథ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారన్నారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. “డార్క్ నైట్’ చిత్రం ఆద్యంతం ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విధంగా ఈ చిత్రాన్ని మలిచాడు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనాన్ని అందించారు. అన్ని విధాల ఎమోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘డార్క్ నైట్’ చిత్రం చేస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్లింగ్‌గా ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో రన్ అవుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది” అన్నారు.






