17 May, 2026 | 12:56 AM

శంబాల దేవిగా అర్చన అయ్యర్

15-02-2025 12:00 AM

అర్చన అయ్యర్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మేకర్లు ఈ చిత్రంలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వస్తున్నారు. ఆది సాయికుమార్, స్వాసిక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అర్చన అయ్యర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్చన ఎరుపు చీరలో ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్‌లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెం చేలా ఉన్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ చిత్ర యూనిట్ ఆసక్తిని పెంచుతోంది. ‘శంబాల’ చిత్రం యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.