సెంట్రల్ వర్క్ షాప్ నందు తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన విజయోత్సవాలు
కొత్తగూడెం,(విజయక్రాంతి): తాడిచెర్ల బ్లాక్-2 సాధన విజయోత్సవాల సందర్భంగా సెంట్రల్ వర్క్ షాప్‌కు విచ్చేసిన డైరెక్టర్ (ఈ & ఎం) తిరుమలరావు , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందేశాన్ని ఉద్యోగులకు తెలియజేశారు. ఈ సందర్భంగా తాడిచెర్ల బ్లాక్-2 మైనింగ్ లీజును సింగరేణికి మంజూరు చేయించడంలో,రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి చేసిన విశేష కృషిని ఆయన కొనియాడారు.
సెంట్రల్ వర్క్ షాప్ జనరల్ మేనేజర్ ఎన్. దామోదర్ రావు మాట్లాడుతూ, తాడిచెర్ల బ్లాక్-2 మైనింగ్ లీజు లభించడం సింగరేణిలో ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. దీని ద్వారా సింగరేణి సంస్థ మరో 40 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తిని కొనసాగించే అవకాశం లభించిందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి కృషి కూడా ఈ విజయానికి దోహదపడిందని పేర్కొన్నారు.






