16 March, 2026 | 4:28 AM

బె‘ధర’ గొడుతున్నారా?

16-03-2026 12:00 AM
  1. పలు దాబా, హోటళ్లలో అధిక ధరలకు విక్రయాలు 

పట్టించుకోని అధికారులు 

అలంపూర్ మార్చి 15:గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా, పుల్లూరు టోల్ ప్లాజాతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పలు దాబా లు, హోటళ్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. హోటల్లో దొరికే ప్రతి ఐటమ్ మీద అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్లు ప్రయాణికులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.టిఫిన్ మొదలుకుని నిత్యావసర వస్తువులైన కూల్ డ్రింక్స్,నీళ్ళ బాటిళ్లు వరకు ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

హోటల్ యజమానులు వారి హోట ల్లో దొరికే తినుబండరాలకు సంబంధించిన రేట్లు ఒక బోర్డుపై రాసి పెట్టాలి అవేవి అక్కడ కనిపించనివని వాళ్లు చెప్పిన రేట్లకే అమౌం ట్ చెల్లించాలని వాహదారులు ,ప్రయాణికులు వాపోయారు. అంతేకాక ఒక వాటర్ బాటిల్,లేదా ఆయా కంపెనీలకు సంబంధించిన కూల్ డ్రింక్ ధర రూ.20 లేదా 30 వరకు ఉండొచ్చు.కానీ వాటిపైన అదనంగా మరో రూ.10 నుంచి 20 రూపాయలు వ సూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి.

ఇదెక్కడి పద్ధతి అని వాహనదారులు యజమానులను ప్రశ్నిస్తే ఇది నేషనల్ హైవే ఇక్కడ ఇంతే రేట్లు ఉంటాయని నిర్లక్ష్యం స మాధానం ఇస్తున్నట్లు కూడా వినికిడి.ఇలా ప్రతి వస్తువు పైన అదనంగా డబ్బులను వ సూలు చేస్తూ ప్రయాణికులను వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నార ని సంబంధిత అధికారులు దాబా, హోటళ్లపైన చర్యలు తీసుకొని అమ్మే వస్తువులపై రే ట్లుకు సంబంధించిన వాటిని కూడా బయట బోర్డుపై ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు.