25 July, 2026 | 11:16 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలి

11-02-2025 01:00 AM

* సోనియాగాంధీ డిమాండ్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ సోమవారం డిమాండ్ చేశారు. జనగణన ఆలస్యమవుతుండడం వల్ల 14 కోట్ల మంది జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిని కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు.

త్వరగా జనగణన చేపట్టడం వల్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఎందరో పేద ప్రజలు లబ్ధి పొందుతారన్నారు. ఇప్పటికీ 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుందని తెలిపారు.