ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం
కొత్తపల్లి,(విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ తో పోరాటం జరుగుతుంది దానిని విద్యార్థిని విద్యార్థులు ఎంతో పెద్ద స్ఫూర్తితో దేశ చరిత్రలోనే అందరు గర్వించదగ్గ పోరాటాన్ని నడిపించడం దేశ భవిష్యత్తును కాపాడటానికి ప్రయత్నం చేసి నేడు విజయాన్ని సాధించడం జరిగిందని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయడం నిర్లక్ష్యం వలన దేశవ్యాప్తంగా నీట్ ఫలితాలలో అవకతవకలు జరగడం దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం కూడా చలనం లేకుండా ఉండడం విద్యార్థుల జీవితాలను చిక్కుల్లో పెట్టడం దేశం మొత్తం చూస్తుందని రానున్న రోజుల్లో బిజెపి ప్రభుత్వం అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, నీట్ పేపర్ లీకేజ్ కు కారకులైన వారిని శిక్షించాలి మరియు విచారణ జరిపించి ఎంత పెద్దవారు ఉన్నా వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇది విద్యార్థుల విజయం దేశ యువత విజయం ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం శ్రద్ధతో పనిచేయాలని వారు హెచ్చరించారు. కేంద్ర కేబినెట్లో ఇంకా అవినీతిపరులు ఉన్నారు వారిని కూడా బర్తరఫ్ చేయాలి.ధర్మేంద్ర ప్రధాన్ కుర్చీని భారత దేశ యువత కదిలించింది అని వారు వ్యక్తం చేశారు ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి చేసి ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకునే విధంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని వారు తెలియజేశారు.






