ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి
25-07-2026 09:44 PM
వనపర్తి,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో నిర్వహించిన రైతు గ్రామసభలో వారు మాట్లాడుతూ పంట మార్పిడి, భూసార పరీక్షలు, నీటి పొదుపు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. అవసరమైన సాంకేతిక సలహాల కోసం వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.






