25 July, 2026 | 10:28 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి

25-07-2026 09:53 PM

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) రూపకల్పన కోసం గ్రామాల వారీగా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు గ్రామ డైరెక్టరీ వివరాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, వ్యవసాయం, సాగునీటి వనరులు తదితర వివరాలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని మొబైల్ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఓ హరికృష్ణ, జనగణన విభాగం అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.