25 July, 2026 | 10:53 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం

25-07-2026 09:48 PM

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు..

నేలకొండపల్లి,(విజయక్రాంతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాగించిన ఉద్యమానికి దక్కిన విజయమని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు అన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం లాఠీచార్జీలు,నిర్బంధాలను ఎదుర్కొంటూ పోరాడిన విద్యార్థుల ధైర్యసాహసాలకు అభినందనలు. ఈ ఉద్యమం యువత ఐక్యంగా పోరాడితే మార్పు సాధ్యమేనని మరోసారి నిరూపించింది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆకాంక్షలను గౌరవించి విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం...యువత కు, విద్యార్థులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.