16 April, 2026 | 10:48 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రోడ్డుప్రమాద బాధితులకు కేంద్రం ఊరట

26-06-2025 12:00 AM
  1. రూ.1.50లక్షల వరకు ఉచిత చికిత్స
  2. కొత్త పథకం అమలుతీరుపై అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రమాదం జరిగిన వారం లోపు రూ.1.5లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అమలుపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించాలని, ప్రమాద వివరాలు, క్షతగాత్రుల వివరాలు ఈ-ధార్‌లో నమోదు చేయాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద నమోదైన ఆసుపత్రుల్లో మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీలు, యూనిసెఫ్, ఎన్‌ఐసీ ప్రతినిధులు, వివిధ అధికారులు పాల్గొన్నారు.