calender_icon.png 26 May, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతాంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

26-05-2025 12:31:05 AM

అశ్వారావుపేట, మే 25 (విజయ క్రాంతి): భారత దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని ఇది అంతర్గతంగా, బాహ్య ద్విముక దాడిని ఎదుర్కొంటుందని వీటిని పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ట్ బి ల్లు, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తేవడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తుందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయ కురాలు చండ్ర అరుణ అన్నారు. 

ఆదివారం  దమ్మ పేట ఏనుగు అప్ప య్య నగర్ లోని, వినాయక ఫంక్షన్ హాల్ లో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ ఐ యు కె ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్ర ధమ మహాసభలు జిల్లా అధ్యక్షులు బుర్ర వెంకన్న అధ్యక్షతన  ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోకి విదేశీ పెట్టబడులను దేశ కార్పొరేట్ల అపరిమిత ప్రవేశం భారతీయ వ్యవసాయాన్ని కార్పోటీకరణ చేయడం కో సం చిన్న సన్న కారు మధ్యతరగతి రైతులను  మన వ్యవసాయ సార్వభౌమత్వాన్ని నాశ నం చేయడం జరుగుతుందన్నారు.

రైతుల ప్రస్తుత బాధలు, వేతలు , ఆత్మహత్యలకు మూల కారణం బహుళ జాతి కంపెనీలు, దేశీయ కార్పొరేట్లు, గ్రామీణ భాగ్యవంతులు ముఖ్యంగా పెట్టుబడిదారీ దళారీల ప్రయోజనం కోసం రూపొందించబడి అమలు చే యబడిన మోడీ ప్రభుత్వ విధానమేనని వారు స్పష్టంచేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి రైతాంగానికి వెన్నుపోటు పొడిచిందని రాష్ట్రంలో కల్తీ విత్తనాలు , ఎరువులను విక్రయిస్తున్న  వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

ప్రభుత్వమే రైతంగానికి ఎరువులు విత్తనాలు అందించాలని,  అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, కార్యదర్శివర్గ సభ్యులు అమర్లపూడి రాము, గోకినపల్లి ప్రభాకర్, నూపా భాస్కర్,అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు ధర్మ, కం గాల కన్నయ్య,ఈసం శంకర్,  బానోత్ పం తులు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వీరబా బు, నకిరికంటి నాగేశ్వరరావు, ప్రగతిశీల మ హిళా సంఘం జిల్లా  కార్యదర్శి కెచ్చల కల్ప న, తదితరులు పాల్గొన్నారు.