26-05-2025 12:29:48 AM
ఇల్లెందు, మే ౨5(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జీయం వి.కృష్ణ య్య సూచించారు. ఆదివారం స్థానిక జిఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏరియాలోని అన్ని గ నులు, విభాగాల ఆధిపతులతో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్ల లో ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని గను లు, కార్యాలయాలను మామిడి తోరణాలతో కొబ్బరి ఆకులు, అరటి చెట్లతో, రంగురంగుల విద్యుత్ దీపాలు రంగు కాగితాలతో అలంకరించాలని సూచించారు.
తదుపరి నిర్వహించే తె లంగాణ పరుగు నందు అధిక సంఖ్యలో పాల్గొనాలని, సాయంకాలం జెకె కాలనీలోని బ్లాక్ డైమండ్ స్టేడియం నం దు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల ప్రదర్శనశాలలు తెలంగాణ రుచులను తెలిపే తినుబండారాల శా లలు తెలంగాణ సాంస్కృతిని తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి హాజరై ఉ ద్యోగులు వారి కుటుంబాలు సంతోషించేలా వినోదా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అందుకు కావలసిన ప్రణాళికను రూపొందించు కోవాలని సంబంధిత అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చా రు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం రామస్వామి, ఏ జి ఎం(ఐఇడి) యం.గిరిధర్ రావు, జెకె. ఓసీ పి. ఓ. కృష్ణ మో హన్, ఏ.జి.ఎం (ఐ.ఇ.డి) యం.గిరిధరరావు, డి.జి.యం (పర్సనల్) జి.వి మోహన్ రావు డిజియం(సివిల్) రవి కుమార్, ఇ. ఇ (వర్క్ షాప్) పి.పవన్ కుమార్, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొనారు.