26-05-2025 12:33:03 AM
కొండా చరణ్ బీఎస్పీ చర్ల మండల అధ్యక్షుడు
చర్ల, మే 25 (విజయక్రాంతి): మండలంలో ఆవుల అక్రమ రవాణా రోజురోజుకి పెరిగిపోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంగా ఈ పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నిబంధనల ను తుంగలో తొక్కుతూ అధిక సంఖ్యలో ట్రాలీలలో, లారీల్లో, కంటైనర్లలో పశువుల ను అత్యంత దారుణంగా కుక్కి మెడలు విరి చి, కాళ్ళు కట్టేసి, నీరు, మేత పెట్టకుండా అ త్యంత హింసాత్మకంగా పశువుల రవాణా చే స్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అతి పవిత్రంగా భావించే ఆవులు అక్రమ రవాణాకు గురి కావడం పట్ల చర్ల మండల హిందూ స మాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఆవుల అక్రమ రవా ణా జరుగుతుంటే స్థానిక అధికారులు ని మ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మం డల ప్రజలు మండిపడుతున్నారు.
సంత పాట దారుల కనుసన్నల్లోనే పశువుల అక్ర మ రవాణా కొనసాగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆవుల అక్రమ రవాణా ను అరికట్టాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
చర్ల టూ హైదరాబాద్
చర్ల నుండి ములుగు మీదుగా హైదరాబాదుకు ఈ పశువులను తరలిస్తున్నారు. జంగాలపల్లి వరకు ఒక వాహనంలో తీసుకె ళ్లి అక్కడ నుంచి మరొక వాహనాల ద్వారా హైదరాబాదుకు తరలిస్తున్నట్లు సమాచా రం. అధికారులకు విషయం తెలిసిన చూసి చూడనట్లు ఉండడంతో, కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మూగజీవాలను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనీ ఆరోపణలు ఉన్నాయి.
కొన్నిసార్లు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు శూన్యం.. ఒ క్కోసారి పశువుల అక్రమ రవాణా పై పత్రిక ల్లో కథనాలు రాస్తున్న విలేకరులపై దాడులకు దిగుతున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వర కు మాత్రమే పశువుల సంత నిర్వహించాల్సి ఉంది. చర్ల లో మాత్రం నిరంతరం ప్రతి రా త్రి యథేచ్ఛగా కొనసాగుతోంది.
పంచాయతీ చూపించిన పరిమితి ప్రదేశాల్లోనే కా కుండా మండలంలో ఇతర ప్రాంతాలలో కూడా ఆవులు అధిక సంఖ్యలో కట్టేస్తున్నా రూ. పశువుల క్రయవిక్రయాలపై కేంద్రం ఎ న్నో నిబంధనలు విధించినప్పటికీ వాటిని అమలు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి.
బహిరం గం ప్రదేశాల్లో కొన్నిచోట్ల ఆవులు, ఎద్దులు, గేదల కళేబరాలను విక్రయాలు చేస్తున్నారని, వాటిని హైదరాబాద్ కు తరలిస్తున్నారని తెలుస్తోంది. అధికారులు తప్పనిసరిగా ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
పశువుల రవాణా చట్టం ఏం చెబుతుంది
పశు రవాణా చట్టం 1978 ద్వారా పశువులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే మండల స్థాయి తీర్మానం చేయాల్సి ఉం టుంది.ట్రాలీలో అయితే రెండు వయసు మళ్లిన పశువులను , లారీలో అయితే నాలు గు పశువులను మాత్రమే ఎక్కించాలనీ, వాటికి నీరు ,మేత తప్పకుండా ఉండాలనీ, ప్రతి అరగంటకు ఒకసారి పశువులను వా హనం దింపి సేదతీరే విధంగా చర్యలు తీసుకోవాలనీ , గర్భంతో ఉన్న పశువులను ఎట్టి పరిస్థితుల్లో తరలించకూడదనీ, అలా రవా ణా చేస్తే ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చే సీ,తరలిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలనీ చట్టంలో స్పష్టంగా పొందపరిచారు.
అయితే ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంది. అధికారుల నిర్ల క్ష్యం కారణంగా చర్ల మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున గోవులు చర్ల మండలం నుండి జిల్లాలకు రాష్ట్రాలకు తరలిస్తున్నారనీ తెలుస్తోంది. తక్షణమే ఈ అక్రమ రవాణాని ఉన్న తాధికారుల జోక్యం చేసుకొని నిలిపివేయాలని, బీఎస్పీ మండల అధ్యక్షులు కొండ చర ణ్ డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ పశువుల రవణదారులపై కఠినమైన చర్యలు తీసుకొ ని, మూగజీవాలను అక్రమ రవాణా దారుల నుంచి కాపాడాలని ఆయన డిమాం డ్ చేశారు. లేనియెడల గోవుల రక్షణ కొరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.