28-10-2025 09:54:27 AM
కరీంనగర్,(విజయక్రాంతి): మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay), రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లు సంతాప సందేశంలో పేర్కొన్నారు. సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి అని, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనతో ఎంతో కాలంగా తనకు సాన్నిహిత్యం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, హరీష్ రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మ వారిని వేడుకుంటున్న అన్నారు. మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.